మారిషస్ దేశ జాతీయ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ..
హైదరాబాద్, 9 మార్చి (హి.స.)ప్రధాని నరేంద్రమోడీ మారిషస్ దేశ పర్యటనకు వెళ్తున్నారు. మార్చి 12న జరిగే ఆ దేశ జాతీయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. మంగళవారం నుంచి రెండు రోజులు పాటు ఈ పర్యటన జరుగుతుంది. రెండు దేశాలు కూడా అనేక ఒప్పందాలపై స
మారిషస్ దేశ జాతీయ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ..


హైదరాబాద్, 9 మార్చి (హి.స.)ప్రధాని నరేంద్రమోడీ మారిషస్ దేశ పర్యటనకు వెళ్తున్నారు. మార్చి 12న జరిగే ఆ దేశ జాతీయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. మంగళవారం నుంచి రెండు రోజులు పాటు ఈ పర్యటన జరుగుతుంది. రెండు దేశాలు కూడా అనేక ఒప్పందాలపై సంతకాలు చేయనున్నాయి. సరిహద్దు ఆర్థిక నేరాలను ఎదుర్కోవడం, వాణిజ్యం పెంపు, వివిధ రంగాల్లో సహకారంపై ఇరు దేశాలు ఒప్పందాలు కుదుర్చుకోనున్నాయి.

శనివారం జరిగిన మీడియా సమావేశంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ, కెపాసిటీ బిల్డింగ్, ద్వైపాక్షిక వాణిజ్యం, సరిహద్దు ఆర్థిక నేరాలను ఎదుర్కోవడం మరియు చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించడం వంటి రంగాలలో ఇరుపక్షాలు అనేక ఒప్పందాలపై సంతకం చేస్తాయని అన్నారు. మారిషస్‌ని సముద్ర పొరుగు దేశంగా మారిషస్‌ని మిస్రీ అభివర్ణించారు. గత 10 ఏళ్లలో రెండు దేశాల మధ్య సంబంధాలు గణనీయంగా పెరిగాయని ఆయన అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande