తెలంగాణ, కరీంనగర్ 9. మార్చి (హి.స.)
శాంతి భద్రతల పరిరక్షణ తమ ధ్యేయమని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలియజేశారు. ఆదివారం సిపిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరిస్తామన్నారు.ప్రజలతో మమేకమై పనిచేస్తామని, సమస్యలు ఉంటే ప్రజలు నేరుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అక్రమ గంజాయి, డ్రగ్స్ రవాణా పై పూర్తి నిఘా ఉంటుందన్నారు. బాధ్యతలు స్వీకరించిన సీపీకి కమిషనర్ పరిధిలోని పోలీసు అధికారులు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్