లింగలపాదుంగ్రమం వద్ద ద్విచక్రవాహనాన్ని ధ్చే కొన్న.అనంతరం అటుగా వెళుతున్న.ట్రాక్టర్ కుండా పది.బాలుడు మృతి
విజయవాడ, 9 మార్చి (హి.స.) నందిగామ, లింగాలపాడు గ్రామం వద్ద ద్విచక్ర వాహనం ఢీకొన్న అనంతరం అటుగా వెళ్తున్న సుబాబుల్‌ ట్రాక్టర్‌ కింద పడి ఓ బాలుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన నకిరికంటి రవీంద్రబాబు కూలి పనులు చేసుకుంటూ జీవిస్తుంటాడు. మొదటి భార్యకు ఇ
లింగలపాదుంగ్రమం వద్ద ద్విచక్రవాహనాన్ని ధ్చే కొన్న.అనంతరం అటుగా వెళుతున్న.ట్రాక్టర్ కుండా పది.బాలుడు మృతి


విజయవాడ, 9 మార్చి (హి.స.)

నందిగామ, లింగాలపాడు గ్రామం వద్ద ద్విచక్ర వాహనం ఢీకొన్న అనంతరం అటుగా వెళ్తున్న సుబాబుల్‌ ట్రాక్టర్‌ కింద పడి ఓ బాలుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన నకిరికంటి రవీంద్రబాబు కూలి పనులు చేసుకుంటూ జీవిస్తుంటాడు. మొదటి భార్యకు ఇద్దరు కుమారులు(కవల పిల్లలు), రెండో భార్యకు కుమార్తె ఉన్నారు. కవలల్లో ఒకరైన జోగేంద్ర(8) స్థానిక ఎస్సీకాలనీ మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. శనివారం సెలవు కావడంతో ఇంటి వద్దనే ఉన్నాడు. ఈ క్రమంలో రవీంద్రబాబు టీవీఎస్‌ మోపెడ్‌పై పొలం వద్ద గడ్డి తీసుకొచ్చేందుకు జోగేంద్రతోపాటు తన అన్న కుమార్తెను తీసుకెళ్లాడు. టీవీఎస్‌ రోడ్డు పక్కన పెట్టి పిల్లల్ని కూడా అక్కడే ఉంచి గడ్డి తీసుకురావడానికి పొలం లోపలికి వెళ్లాడు. అదే సమయంలో లింగాలపాడు నుంచి తక్కెళ్లపాడు గ్రామం వైపు సుబాబుల్‌ ట్రాక్టర్‌ వెళ్తోంది. దీనికి ఎదురుగా తక్కెళ్లపాడు నుంచి లింగాలపాడుకు రెండు మిర్చి టిక్కీలను ద్విచక్రవాహనంపై తీసుకొని మరో వ్యక్తి వస్తూ రోడ్డుపై ఉన్న ఇద్దరు పిల్లలను ఢీ కొట్టాడు. దీంతో బాలుడు జోగేంద్ర రోడ్డుపై పడడంతో అదే సమయంలో సుబాబుల్‌ ట్రాక్టర్‌ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. బాలిక రోడ్డుకు మరోవైపు ఉన్న పొలాల్లో పడినా ఆమె క్షేమంగా బయటపడింది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి నందిగామ ఆస్పత్రిలో శవ పరీక్ష చేసిన అనంతరం బంధువులకు అప్పగించారు. గ్రామ తెదేపా నాయకుడు ఉమ్మనేని విక్రమ్‌ తదితరులు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande