ఆదిలాబాద్ జిల్లాలో నేషనల్ హైవే పై రోడ్డు ప్రమాదం. ఇద్దరు మృతి.
తెలంగాణ, 9 మార్చి (హి.స.) ఆదిలాబాద్ జిల్లాలో జాతీయ రహదారి 44 పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున 4.20 గంటల సమయంలో రెండు వాహనాలు ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబ
Accident


తెలంగాణ, 9 మార్చి (హి.స.)

ఆదిలాబాద్ జిల్లాలో జాతీయ రహదారి 44 పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున 4.20 గంటల సమయంలో రెండు వాహనాలు ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్ర వైపు వెళ్తున్న ఒక వ్యాన్ టైర్ ప్రమాదవశాత్తు పేలిపోయింది. అనంతరం ఆ వాహనం డివైడర్ను ఢీకొట్టింది. ఇదే సమయంలో హైదరాబాద్ నుంచి జబల్పూర్ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు.. వేగంగా దూసుకొచ్చి వ్యాన్ను ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్తో పాటు అందులో ఉన్న అదనపు డ్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించారు. సంఘటన స్థలాన్ని ఉదయం జిల్లా ఎస్పీ గౌష్ ఆలం హుటిన వెళ్లి పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను పోలీసులను, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande