దోమలపెంట:, 9 మార్చి (హి.స.) నాగర్‌కర్నూల్ జిల్లాలో కూలిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సొరంగంలో గల్లంతైన వారిని గుర్తించడంలో కొంత పురోగతి లభించింది. ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో డి-2 పాయింట్‌లో మనుషుల ఆనవాళ్లను కేరళ జాగిలాలు గుర్తించినట్లు సమాచారం. ఈ ప్రాంతంలో సిబ్బంది జాగ్రత్తగా మట్టిని తొలగిస్తున్నారు. గల్లంతైన వారిలో కొందరిని నేడు సాయంత్రానికి గుర్తించే అవకాశం ఉంది. ఆనవాళ్లు లభించడాన్ని ఇంకా అధికారులు ధ్రువీకరించలేదు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల