నంద్యాల, 9 మార్చి (హి.స.) నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. రెండో శనివారం, ఆదివారం కావడంతో అత్యధిక సంఖ్యలో భక్తులు శ్రీశైల క్షేత్రానికి పోటెత్తారు. దీంతో ఆదివారం స్వామి అమ్మవార్ల దర్శనానికి క్యూలైన్స్ లో దర్శనం కంపార్టుమెంట్లలో బారులు తీరారు. స్వామి అమ్మవార్ల దర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. అలాగే, ఆలయ అధికారులు కేవలం స్పర్శ దర్శనానికి మాత్రమే భక్తులను అనుమతిస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో శ్రీనివాసరావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..