తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. 9 మార్చి (హి.స.) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మహిమాన్విత పుణ్యక్షేత్రం భద్రాచల శ్రీ సీతారామ చంద్ర స్వామి
వారిని తెలంగాణా హైకోర్టు న్యాయమూర్తి సూరేపల్లి నంద ఆదివారం ఉదయం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన వీరికి సంబంధిత అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం భద్రాచలం జ్యుడిషియల్ కోర్ట్ ను సందర్శించిన హైకోర్టు న్యాయమూర్తి స్థానిక కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్