న్యూఢిల్లీ,, 9 మార్చి (హి.స.)పాకిస్థాన్, చైనాలు నూరు శాతం కుమ్మక్కయ్యాయని, ఈ వాస్తవాన్ని భారత్ గుర్తించకతప్పదని సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది అభిప్రాయపడ్డారు. ఈ కారణంగా పశ్చిమం, ఉత్తరం..రెండు దిక్కులా దాడిని ఎదుర్కొవాల్సిన ముప్పు ఏర్పడిందని తెలిపారు. ఇక్కడ ఒక ఆంగ్ల న్యూస్ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పాక్ వద్ద ఉన్న ఆయుధాలన్నీ చైనాలో తయారైనవేనని అన్నారు. సీమాంతర ఉగ్రవాదం గురించి మాట్లాడుతూ పొరుగుదేశం నుంచి ఉగ్రవాదుల రాక ఏమీ తగ్గలేదని చెప్పారు. వారి రాక పెరగనుందని, పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ‘‘గత ఏడాది పట్టుబడిన ఉగ్రవాదుల్లో 60ు మంది పాకిస్థాన్ మూలాలు ఉన్నవారే. అందువల్ల పొరుగు దేశం నుంచి ఇంకా ముప్పు తొలగిపోలేదు’’ అని ఆయన వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు