హైదరాబాద్, 9 మార్చి (హి.స.)ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరనున్న సీఎం రేవంత్ రెడ్డి
11.45 గంటలకు ఢిల్లీ చేరుకొనున్న సీఎం
రేపటితో ముగియనున్న ఎమ్మెల్సీ నామినేషన్ల గడువు
నేడు కేసీ వేణుగోపాల్ నివాసంలో జరగనున్న కీలక సమావేశం
4 ఎమ్మెల్సీ స్థానాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఆశావాహులు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ సామాజిక వర్గాలకు ఎమ్మెల్సీలు కేటాయింపు
నాలుగు స్థానాల్లో ఒక స్థానాన్ని ఆశిస్తున్న సీపీఐ
మహిళ కోటలో ఎమ్మెల్సీ స్థానం కోసం ఎదురుచూస్తున్న విజయశాంతి, సునీత రావు
ఎమ్మెల్సీ ఆశావాహులు జాబితాలో ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, హరకర వేణుగోపాల్, జీవన్ రెడ్డి, సామా రామ్మోహన్ రెడ్డి, అద్దంకి దయాకర్, బండి సుధాకర్ గౌడ్, చరణ్ కౌశిక్ యాదవ్
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు