మహాకుంభ మేళా పింటూ అనే పడవల యజమానికి ఏకంగా రూ.30 కోట్ల రాబడిని
ప్రయాగ్‌రాజ్‌ , 9 మార్చి (హి.స.)ఉత్తర్‌ప్రదేశ్‌లోని త్రివేణీసంగమంలో 45 రోజులపాటు కొనసాగి ఇటీవల ముగిసిన మహాకుంభ మేళా పింటూ మహరా (45) అనే పడవల యజమానికి ఏకంగా రూ.30 కోట్ల రాబడిని తెచ్చిపెట్టింది. స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అసెంబ్లీ వేద
మహాకుంభ మేళా పింటూ అనే పడవల యజమానికి ఏకంగా రూ.30 కోట్ల రాబడిని


ప్రయాగ్‌రాజ్‌ , 9 మార్చి (హి.స.)ఉత్తర్‌ప్రదేశ్‌లోని త్రివేణీసంగమంలో 45 రోజులపాటు కొనసాగి ఇటీవల ముగిసిన మహాకుంభ మేళా పింటూ మహరా (45) అనే పడవల యజమానికి ఏకంగా రూ.30 కోట్ల రాబడిని తెచ్చిపెట్టింది. స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అసెంబ్లీ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించడంతో పింటూ విజయగాథ చర్చనీయాంశంగా మారింది. మేళాకు కోట్ల సంఖ్యలో భక్తులు తరలివస్తారన్న విషయాన్ని ముందే పసిగట్టి.. తన వద్ద ఉన్న పడవల సంఖ్యను 60 నుంచి 130కు పెంచుకోవడం పింటూ తీసుకొన్న సాహసోపేతమైన నిర్ణయమని దీనిపై ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందుకోసం ఆయన కుటుంబం ఇంట్లోని బంగారాన్ని తాకట్టు పెట్టడంతోపాటు బయట రుణాలు కూడా తీసుకొని అవిశ్రాంతంగా శ్రమించింది. 2019లో జరిగిన అర్ధ కుంభమేళా భక్తుల తాకిడిని స్వయంగా చూసిన అనుభవంతో పింటూ ఈ సారి తన వ్యాపారాన్ని ముందస్తుగా విస్తరించడంలో జాగ్రత్త పడ్డారు. 130 పడవలను నడిపేందుకు ఆయన 300 మంది యువతకు ఉపాధి కల్పించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande