హైదరాబాద్, 9 మార్చి (హి.స.)తెలంగాణ ఉద్యమం కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ ఎన్నో త్యాగాలు చేశారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆయన చనిపోతే మాజీ సీఎం కనీసం చూసేందుకు కూడా రాలేదని విమర్శించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిర్వహించిన అఖిల భారత పద్మశాలి మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. టెక్సటైల్ వర్సిటీ ఏర్పాటు చేసిన దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టామని గుర్తుచేశారు. ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కూడా ఆయన పేరు పెట్టనున్నట్లు వెల్లడించారు. పద్మశాలిలకు అండగా ఉంటామన్నా
-
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు