దేశ, రాష్ట్ర చరిత్రలో ఇదొక అరుదైన ఘట్టం
అమరావతి: , 9 మార్చి (హి.స.)నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA Kotam Reddy Sridhar Reddy) ఇవాళ(ఆదివారం) ఒక్క రోజే 105 అభివృద్ధి కార్యక్రమాలకు (105 Projects Launch) శ్రీకారం చుట్టారు. అభివృద్ధి కార్యక్రమాలను పెద్దఎత్తుల
దేశ, రాష్ట్ర చరిత్రలో ఇదొక అరుదైన ఘట్టం


అమరావతి: , 9 మార్చి (హి.స.)నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA Kotam Reddy Sridhar Reddy) ఇవాళ(ఆదివారం) ఒక్క రోజే 105 అభివృద్ధి కార్యక్రమాలకు (105 Projects Launch) శ్రీకారం చుట్టారు. అభివృద్ధి కార్యక్రమాలను పెద్దఎత్తులో చేపట్టడంపై మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) అభినందనలు తెలిపారు. సోషల్ మాధ్యమం ఎక్స్ వేదికగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని అభినందిస్తూ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు.

శ్రీధర్ రెడ్డి ఒకే రోజు 105 అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని అన్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి రికార్డు సృష్టించారని నారా లోకేష్ తెలిపారు. దేశ, రాష్ట్ర చరిత్రలో ఇదొక అరుదైన ఘట్టమని ఉద్ఘాటించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తుంది అనడానికి ఇదొక ఉదాహరణ అని మంత్రి నారా లోకేష్ తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande