ఢిల్లీ, 9 మార్చి (హి.స.)మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ సోమవారం మత మార్పిడుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. మత మార్పిడుల కేసుల్లో మరణశిక్ష విధించాలని పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వ దీనిపై ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని కలిగి ఉందని అన్నారు. మైనర్లపై అత్యాచారానికి శిక్ష విధించినట్లే, బాలికల్ని మతం మార్చిన వారికి కూడా మరణశిక్ష విధించే నిబంధనల్ని తమ ప్రభుత్వం ప్రవేశపెడుతుందని ఆయన చెప్పారు.
‘‘అమాయకమైన కూతుళ్లను అత్యాచారం చేసే వారిపై ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. ఈ విషయంలో మరణశిక్ష విధించే నిబంధనలను రూపొందించారు. దీనికి తోడు మతమార్పిడులకు పాల్పడే వారికి కూడా మధ్యప్రదేశ్ మత స్వేచ్ఛా చట్టంలో మరణశిక్ష విధించే నిబంధనను కూడా ప్రవేశపెడతాము’’ అని అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఆయన అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు