మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. తులం ధర ఎంతో తెలుసా..?
ముంబై, 12 జూన్ (హి.స.)బంగారం ధరల్లో ప్రతి రోజు మార్పులు చోటు చేసుకుంటాయి. గత రెండు, మూడు రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు.. తాజాగా పెరిగాయి. నిన్నటికి ఇప్పటికి పోల్చుకుంటే తులం బంగారం ధరపై దాదాపు వెయ్యి రూపాయలకుపైగా పెరిగింది. బంగారానికి మన భ
GOLD


ముంబై, 12 జూన్ (హి.స.)బంగారం ధరల్లో ప్రతి రోజు మార్పులు చోటు చేసుకుంటాయి. గత రెండు, మూడు రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు.. తాజాగా పెరిగాయి. నిన్నటికి ఇప్పటికి పోల్చుకుంటే తులం బంగారం ధరపై దాదాపు వెయ్యి రూపాయలకుపైగా పెరిగింది. బంగారానికి మన భారతీయ సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. బంగారం ధరలు పెరిగినా.. తగ్గినా కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. జూన్‌12వ తేదీన దేశీయంగా బంగారం ధరలు పెరిగాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,410 ఉండగా, అదే 22 క్యారెట్ల ధర రూ.90,210 వద్ద ట్రేడవుతోంది. ఇక దేశీయంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,560 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 90,360 రూపాయలు ఉంది. ఇక ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,410 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 90,210 రూపాయలు ఉంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,410 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 90,210 రూపాయలు ఉంది. ఇక విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,410 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 90,210 రూపాయలు ఉంది.

ఇక బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,410 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 90,210 రూపాయలు ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,410 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 90,210 రూపాయలు ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande