సర్జరీ అనంతరం ప్రభుత్వ హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయిన కరీంనగర్ కలెక్టర్
తెలంగాణ, కరీంనగర్. 17 జూన్ (హి.స.) ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని, వైద్యుల సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న కలెక్టర్ ఇటీవల కరీంనగర్
కరీంనగర్ కలెక్టర్


తెలంగాణ, కరీంనగర్. 17 జూన్ (హి.స.)

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని, వైద్యుల సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న కలెక్టర్ ఇటీవల కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సర్జరీ చేయించుకున్నారు. శస్త్ర చికిత్స అనంతరం మంగళవారం.. ఆసుపత్రి నుంచి కలెక్టర్ డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ ప్రభుత్వ వైద్యుల సేవలు వినియోగించుకోవాలని, ప్రభుత్వ ఆసుపత్రులలో ఎంతో ఆధునిక పరికరాలతో కూడిన అనుభవజ్ఞులు ఉన్నారని, తానే స్వయంగా చూసి ఇక్కడ సర్జరీ చేయించుకున్నానని ఆనందం వ్యక్తం చేశారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande