ఇందిరా మహిళా శక్తి చీరలతో నేతన్నలకు చేతినిండా పని : వేములవాడ ఎమ్మెల్యే
తెలంగాణ, రాజన్న సిరిసిల్ల. 17 జూన్ (హి.స.) ఇందిరా మహిళా శక్తి చీరల ఆర్డర్లతో సిరిసిల్ల నేత కార్మికులకు చేతినిండా పని కల్పిస్తున్నామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. గడువులోగా మొదటి చీరను అందించి, రెండవ చీర తయారీకి సన
వేములవాడ ఎమ్మెల్యే


తెలంగాణ, రాజన్న సిరిసిల్ల. 17 జూన్ (హి.స.) ఇందిరా మహిళా శక్తి చీరల ఆర్డర్లతో సిరిసిల్ల నేత కార్మికులకు చేతినిండా పని కల్పిస్తున్నామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. గడువులోగా మొదటి చీరను అందించి, రెండవ చీర తయారీకి సన్నద్ధం కావాలని ఆయన మరమగ్గాల కార్మికులకు సూచించారు. మంగళవారం సిరిసిల్ల పట్టణంలోని గణేష్ నగర్ లో ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తి ప్రక్రియను రాష్ట్ర చేనేత జౌళి, దేవాదాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ తో కలిసి పరిశీలించారు.

అనంతరం వారు మాట్లాడుతూ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, వస్త్ర పరిశ్రమ అభివృద్ధితో పాటు కార్మికులను ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అందులో భాగంగానే ఇందిరా మహిళా శక్తి చీరల ఆర్డర్లను ప్రభుత్వం అందించిందని అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande