హైదరాబాద్, 21 జూన్ (హి.స.) హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ సుబేదారి పోలీసులు ఆయనను శంషాబాద్ విమానాశ్రయంలో శనివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వరంగల్ కు తరలించారు. ఆయనపై బీఎన్ఎస్ సెక్షన్ 308(2), 308(4), 352 కింద కేసులు నమోదుచేశారు. కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించే అవకాశం ఉన్నది. మనోజ్ రెడ్డి అనే వ్యాపారిని రూ.50 లక్షలు ఇవ్వాలంటూ బెదిరించాడని అతని భార్య సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.
కాగా, సుబేదారి పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నాలుగు రోజుల క్రితం హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ విషయంలో ఆయనకు చుక్కెదురయింది. దీంతో అరెస్టు తప్పలేదు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..