నాషా ముక్త్ భారత్ అభియాన్ కింద వారం రోజుల కార్యకలాపాలు : కలెక్టర్ రాహుల్ రాజ్
తెలంగాణ,మెదక్. 21 జూన్ (హి.స.) నాషా ముక్త్ భారత్ అభియాన్ కింద జిల్లా స్థాయిలో వారం రోజుల మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ కార్యకలాపాలు కోసం ప్రభుత్వం ద్వారా సమగ్ర ప్రణాళికను రూపొందించిందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. శనివారం జిల్లా క
మెదక్ కలెక్టర్


తెలంగాణ,మెదక్. 21 జూన్ (హి.స.)

నాషా ముక్త్ భారత్ అభియాన్ కింద జిల్లా స్థాయిలో వారం రోజుల మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ కార్యకలాపాలు కోసం ప్రభుత్వం ద్వారా సమగ్ర ప్రణాళికను రూపొందించిందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలో యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో టగ్ ఆఫ్ వార్, లెమన్ అండ్ స్పూన్ క్రీడా పోటీలు మహిళలకు నిర్వహించారు. అనంతరం విద్యార్థినీలకు బస్తా జంప్ గేమ్ వివిధ క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ క్రీడా పోటీలను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ యాంటీ-నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (IGANB), ప్రహరీ క్లబ్‌లు, సంబంధిత జిల్లాల్లోని వారం రోజులు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande