సీట్లు వందల్లో – దరఖాస్తులు వేలల్లో..ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బి టెక్ కోర్స్
తెలంగాణ, నిర్మల్. 22 జూన్ (హి.స.) ఆర్జీయూకేటీ యూనివర్సిటీ బాసర మరియు మహబూబ్ నగర్ కేంద్రాలలో 2025-26 విద్యా సంవత్సరానికి ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బి టెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తుల స్వీకరణ నిన్నటితో ముగిసిందని వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ గోవర్
బాసర త్రిబుల్ ఐటీ


తెలంగాణ, నిర్మల్. 22 జూన్ (హి.స.)

ఆర్జీయూకేటీ యూనివర్సిటీ బాసర మరియు మహబూబ్ నగర్ కేంద్రాలలో 2025-26 విద్యా సంవత్సరానికి ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బి టెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తుల స్వీకరణ నిన్నటితో ముగిసిందని వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. బాసర 1500,మహబూబ్ నగర్ 180 సీట్లకు గాను మొత్తం 20258 దరఖాస్తులు వచ్చాయని వారు పేర్కొన్నారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం జూలై 4వ ఎంపిక జాబితా విడుదల చేయనున్నట్లు చెప్పారు. జూలై 7వ తేదీ నుండి మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రవేశాల ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టామని వీసీ తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande