అమరావతి, 22 జూన్ (హి.స.)
విజయనగరం రూరల్: జామి మండలంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నూతన విగ్రహాన్ని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆవిష్కరించారు. ఆదివారం అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..అంబేడ్కర్ ఆశయాలను మనందరం ఆచరణలో పెట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, యువత తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ