అమరావతి, 26 జూన్ (హి.స.)
: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్ ( )ను ఏర్పాటు చేసింది. విజయవాడ కేంద్రంగా జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు (GO) జారీ చేసింది. ఇది పోలవరం - బనకచర్ల ) నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్పొరేషన్. అలాగే ఇతర ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసేందుకూ పని చేస్తుంది. విజయవాడలో జలవనరుల శాఖ కార్యాలయంలో ‘జలహారతి’ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటైంది. బనకచర్లతోపాటు ఇతర ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసేలా ఈ సంస్థకు బాధ్యతలు అప్పగించింది ఏపీ ప్రభుత్వం.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ