అమరావతి, 26 జూన్ (హి.స.)
సున్నిపెంట సర్కిల్: ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 1.02 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. జలాశయం నీటిమట్టం గురువారం ఉదయం 6 గంటల సమయానికి 861.70 అడుగులు.. నీటి నిల్వ 111.40టీఎంసీలుగా నమోదైంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ