హైదరాబాద్, 26 జూన్ (హి.స.)
తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం టీజీపాలీసెట్–2025 అడ్మిషన్ కౌన్సిలింగ్ గురువారం రాష్ట్రవ్యాప్తంగా హెల్ప్ లైన్ సెంటర్లలో ఒకేసారి విజయవంతంగా ప్రారంభమైంది. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులలో ప్రవేశాల కోసం ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలలో ఈ కౌన్సిలింగ్ ద్వారా ప్రవేశం పొందవచ్చు.ఈ సందర్భంగా TG POLYCET హెల్ప్ లైన్ సెంటర్‌గా గుర్తింపు పొందిన వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కేంద్రంలో మొదటి రోజు ప్రక్రియ విజయవంతంగా ప్రారంభమైంది. ఉదయం నుండే అభ్యర్థులు భారీ సంఖ్యలో హాజరై, మొత్తం 430 మంది అభ్యర్థులు మొదటి రోజే నమోదు చేసుకున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ క్రమబద్ధంగా, సజావుగా కొనసాగుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్