తెలంగాణ, ఆదిలాబాద్. 30 జూన్ (హి.స.)
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ రాజ్యంలో నిరుపేదలకు ఇండ్ల కల సాకారం చేస్తున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ అన్నారు. ఆయన సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పట్టణంలోని గంగన్నపేటలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు.
అంతకుముందు మోమిన్ పురలో 25 లక్షలతో నిర్మించే నీటిపారుదల శాఖ నూతన సబ్ డివిజన్ కార్యాలయం భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. గంగన్నపేటలో గ్రామస్తుల సమస్యలు తెలుసుకుని ఆ కాలనీలో సిసి రోడ్డు నిర్మిస్తానని హామీ ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు