రాష్ట్రమంతా ఘనంగా బక్రీద్ వేడుకలు..
హైదరాబాద్, 7 జూన్ (హి.స.) త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పర్వదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో వేడుకలను నిర్వహించుకున్నారు. పండుగ సందర్భంగా హైదరాబాద్ తోపాటు గ్రామాలు, పట్టణాల్లోని మసీదులు, ఈద్గాలకు
బక్రీద్


హైదరాబాద్, 7 జూన్ (హి.స.)

త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పర్వదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో వేడుకలను నిర్వహించుకున్నారు. పండుగ సందర్భంగా హైదరాబాద్ తోపాటు గ్రామాలు, పట్టణాల్లోని మసీదులు, ఈద్గాలకు తెల్లవారుజాము నుంచే క్యూకట్టారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటున్నారు. కొత్తబట్టలు ధరించి పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నారు. ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఈద్గా మైదానంలో జరిగిన ప్రార్థనలకు పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు హాజరయ్యారు. ములుగు జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande