విషమంగానే ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం.. వెంటిలేటర్పై కొనసాగుతున్న చికిత్స
హైదరాబాద్, 7 జూన్ (హి.స.) జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం విషమంగానే ఉంది. అపస్మారక స్థితిలో ఉన్న ఆయనకు వైద్యులు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. గురువారం ఆయన ఇంట్లో అకస్మాత్తుగా గుండెపోటుకు గురికావడంతో కుటుంబ సభ్యులు హు
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే


హైదరాబాద్, 7 జూన్ (హి.స.)

జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం విషమంగానే ఉంది. అపస్మారక స్థితిలో ఉన్న ఆయనకు వైద్యులు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. గురువారం ఆయన ఇంట్లో అకస్మాత్తుగా గుండెపోటుకు గురికావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానకు తరలించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి హాస్పిటల్లోనే చికిత్స అందిస్తున్నారు. కార్డియాక్ అరెస్టు కావడం.. సీపీఆర్తో తిరిగి గుండె కొట్టుకోవడంతోపాటు నాడి సాధారణ స్థితికి వచ్చినా.. ఇంకా అపస్మారక స్థితి నుంచి ఆయన బయటపడలేదు. కొంత సమయం గడిస్తే తప్ప ఏమీ చెప్పలేమని వైద్యులు తెలిపారు. నిపుణులైన వైద్యబృందం 24 గంటలూ పర్యవేక్షిస్తున్నదని చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande