మహిళా ఎస్సై పై దాడికి ప్రయత్నించిన ఏడుగురు నిందితుకు రిమాండ్.. ఖమ్మం సిపి సునీల్ దత్
తెలంగాణ, ఖమ్మం. 7 జూన్ (హి.స.) ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు మండలంలో మహిళా ఎస్సై పై దాడికి ప్రయత్నించిన ఏడుగురు నిందితులను రిమాండ్ కు తరలించినట్లు సిపి సునీల్ దత్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విధి నిర
ఖమ్మం సిపి


తెలంగాణ, ఖమ్మం. 7 జూన్ (హి.స.)

ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు మండలంలో మహిళా ఎస్సై పై దాడికి ప్రయత్నించిన ఏడుగురు నిందితులను రిమాండ్ కు తరలించినట్లు సిపి సునీల్ దత్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ఉన్న కల్లూరు పోలీస్ స్టేషన్ మహిళా ఎస్సై హరిత తో దురుసుగా ప్రవర్తించిన ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. తల్లాడ గ్రామానికి చెందిన రాయల రామారావుతో కలిసి మరి కొంతమంది యువకులు శుక్రవారం రాత్రి మద్యం మత్తులో కల్లూరు పట్టణం ఎన్నెస్పీ క్రాస్ రోడ్డులోని చౌదరి హోటల్ వద్దకు వచ్చి గొడవ చేస్తున్నారని హోటల్ యజమాని అయిన మాగంటి బోసుబాబు కల్లూరు పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేశారన్నారు. అ కేసు విచారణ నిమిత్తం ఘటన ప్రాంతానికి ఎస్సై వెళ్తున్న విషయాన్ని తెలుసుకున్న రాయల రామారావు, తన అనుచరులతో మరల హోటల్ వద్దకు వచ్చి సాక్ష్యాలుగా ఉన్న హోటల్ సిబ్బందిని, యజమానిని తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినట్లయితే ఇబ్బందులకు గురి చేస్తానని హోటల్ నడవనివ్వనని హోటల్ ముందు కుర్చీ వేసుకుని కూర్చుని న్యూసెన్స్ చేస్తున్నాడనే సమాచారంతో ఎస్సై తన పోలీస్ సిబ్బందితో హోటల్ వద్దకు వెళ్లి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande