కోపర్తి పారిశ్రామిక వాడకు మహర్దశ
అమరావతి, 7 జూన్ (హి.స.) , కడప: కొప్పర్తి పారిశ్రామికవాడకు మహర్దశ పట్టనుంది. విశాఖపట్నం- చెన్నై కారిడార్‌లో భాగంగా కొప్పర్తిని పారిశ్రామిక హబ్‌గా కేంద్ర ప్రభుత్వం ఇది వరకు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో పారిశ్రామిక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ
కోపర్తి పారిశ్రామిక వాడకు మహర్దశ


అమరావతి, 7 జూన్ (హి.స.)

, కడప: కొప్పర్తి పారిశ్రామికవాడకు మహర్దశ పట్టనుంది. విశాఖపట్నం- చెన్నై కారిడార్‌లో భాగంగా కొప్పర్తిని పారిశ్రామిక హబ్‌గా కేంద్ర ప్రభుత్వం ఇది వరకు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో పారిశ్రామిక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తాజాగా నిధులు కేటాయించింది. ఈ నిర్ణయంతో కొప్పర్తిలో అతి పెద్ద కంపెనీలు పరిశ్రమలను స్థాపించనున్నాయి. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 1.76 లక్షల మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పారిశ్రామిక అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి. అయిదేళ్ల కిందటే విశాఖపట్నం- చెన్నై పారిశ్రామిక కారిడార్‌ (వీసీఐసీ)లో భాగంగా కొప్పర్తిని అభివృద్ధి చేయాలని కేంద్రం భావించినా గత వైకాపా ప్రభుత్వం సహకారం లేకపోవడంతో అది కార్యరూపం దాల్చలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న చొరవతో రాయలసీమ నడిబొడ్డున ఉన్న కడప శివారులో కమలాపురం నియోజకవర్గంలో పెండ్లిమర్రి, సీకేదిన్నె, వల్లూరు మండలాల పరిధిలో ఆరు గ్రామాల పరిధిలో 6,740.44 ఎకరాల పరిధిలో రూ.17,310 కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తూ కొప్పర్తి పారిశ్రామిక నోడ్‌గా గుర్తిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. తద్వారా రవాణా మార్గాలు, ఉపాధి అవకాశాలతో జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల దశ మారనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande