అమరావతి, 1 జూలై (హి.స.): ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ) ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఈరోజు (మంగళవారం) తూర్పుగోదావరి జిల్లా మలకపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను సీఎం పంపిణీ చేయాల్సి ఉంది. అక్కడకు వెళ్లి గ్రామసభల్లో పాల్గొనడంతో పాటు పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా నేడు ఉండవల్లిలోని నివాసం నుంచి తూర్పుగోదావరి జిల్లా కాపవరం వెళ్లి అక్కడి నుంచి నేరుగా మలకపల్లి వెళ్లాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ