పార్టీ కోసం నిరంతరం కష్టపడిన నాయకులకే పెద్ద పదవులు.. ఎంపీ లక్ష్మణ్
హైదరాబాద్, 1 జూలై (హి.స.) బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా మన్నెగూడలో సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు, ఓబీసీ మ
ఎంపీ లక్ష్మణ్


హైదరాబాద్, 1 జూలై (హి.స.)

బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ

అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా మన్నెగూడలో సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ మాట్లాడుతూ.. రాంచందర్ రావు ఆర్ఎస్ఎస్లో శిక్షణ పొంది, విద్యార్థి పరిషత్ నాయకుడిగా ఉస్మానియా యూనివర్సిటీలో నాయకత్వం వహిస్తూ, బీజేపీలో గత 40 ఏళ్లుగా పనిచేస్తున్న ఓ నిజమైన కార్యకర్త. ఇది ఒక కార్యకర్తకు దక్కిన గౌరవంగా భావించాలని అన్నారు. బీజేపీలో నమ్మిన సిద్ధాంతం కోసం, పార్టీ కోసం నిరంతరం కష్టపడిన నాయకులకే పెద్ద పదవులు లభిస్తాయి. దానికి రాంచందర్ రావు మరో ఉదాహరణ అని అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande