అధ్యక్షులుగా ఎవరు ఉన్నా బీజేపీ పార్టీకి కార్యకర్తలే నిజమైన నాయకులు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
హైదరాబాద్, 1 జూలై (హి.స.) అధ్యక్షులుగా ఎవరు ఉన్నా బీజేపీ పార్టీకి కార్యకర్తలే నిజమైన నాయకులు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అధ్యక్షుడిగా నేను ఉన్నా మరొకరు ఉన్నా కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అన్నారు. 14 కోట్ల మంది సభ్యులు కలిగిన బీజేపీ పా
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.


హైదరాబాద్, 1 జూలై (హి.స.)

అధ్యక్షులుగా ఎవరు ఉన్నా బీజేపీ పార్టీకి కార్యకర్తలే నిజమైన నాయకులు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అధ్యక్షుడిగా నేను ఉన్నా మరొకరు ఉన్నా కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అన్నారు. 14 కోట్ల మంది సభ్యులు కలిగిన బీజేపీ పార్టీలో సభ్యత్వం కలిగి ఉండటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు. ఎవరు అధ్యక్షులుగా ఉన్నా మనమంతా ఐక్యమత్యంతో అంకితభావంతో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ అధ్యక్షుడు అయినంత మాత్రాన మాకేమి కిరీటాలు రావని బాధ్యతలన్ని అధ్యక్షుడిపైనే వదిలేసేది లేదన్నారు. ఇంత కాలం సమిష్టిగా పని చేశామని ఇకపై కూడా సమిష్టిగా పనిచేయాలని పిలుపు నిచ్చారు. తెలంగాణ అసెంబ్లీపై కాషాయజెండా ఎగరవేయడమే ఏకైక లక్ష్యం అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు ప్రకటన కార్యక్రమంలో మాట్లాడిన కిషన్ రెడ్డి దేశ ప్రజలు, బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణ వైపు చూస్తోందని అన్నింటికి మించి తెలంగాణలోని మారుమూల ప్రాంతాల్లోని గ్రామీణ ప్రజలు కమలం పువ్వు జెండా వైపు చూస్తున్నారన్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande