దేవాలయాల నిర్మాణానికి 84 లక్షల నిధుల మంజూరు.. ఎమ్మెల్యే పవర్ రామారావు
తెలంగాణ, నిర్మల్. 1 జూలై (హి.స.) నియోజకవర్గంలోని పలు దేవాలయాల నిర్మాణానికి సి.జి.ఎఫ్ నిధులు మంజూరైనట్లు ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తెలియజేశారు. పల్సి గ్రామంలోని దత్తాత్రి టెంపుల్ కి 12 లక్షలు, కుంటాల మండలంలోని ఓల శివాలయ నిర్మాణానికి 7 లక్
ఎమ్మెల్యే రామారావు


తెలంగాణ, నిర్మల్. 1 జూలై (హి.స.) నియోజకవర్గంలోని పలు దేవాలయాల నిర్మాణానికి సి.జి.ఎఫ్ నిధులు మంజూరైనట్లు ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తెలియజేశారు. పల్సి గ్రామంలోని దత్తాత్రి టెంపుల్ కి 12 లక్షలు, కుంటాల మండలంలోని ఓల శివాలయ నిర్మాణానికి 7 లక్షలు, కుంటాల మండల కేంద్రంలోని గజ్జలమ్మ 15 లక్షలు,తానూర్ మండలంలోని బేల్ తరోడా హనుమాన్ మందిర్ కు ఫేజ్ వన్ లో 15 లక్షలు,కుంసర గ్రామంలో శివాలయ నిర్మాణానికి ఫేజ్ వన్ లో 25 లక్షలు రూపాయల నిధులు మంజూరు కావడం జరిగిందన్నారు. మొత్తం 84 లక్షల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు ధన్యవాదాలు తెలియజేశారు .

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande