సంగారెడ్డి జిల్లా పాశ మైలారం ఘటనలో మృతుల.సంఖ్య.31 కు.చేరింది
సంగారెడ్డి 1 జూలై (హి.స.) పాశమైలారం: సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఘటనలో మృతుల సంఖ్య 31కి చేరింది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. భవనం, శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. వెలికితీసిన మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరల
సంగారెడ్డి జిల్లా పాశ మైలారం ఘటనలో మృతుల.సంఖ్య.31 కు.చేరింది


సంగారెడ్డి 1 జూలై (హి.స.)

పాశమైలారం: సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఘటనలో మృతుల సంఖ్య 31కి చేరింది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. భవనం, శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. వెలికితీసిన మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో 108 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రుల్లో 11 మంది పరిస్థితి పరిస్థితి విషమంగా ఉంది. వారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

సోమవారం పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో పలువురికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిలో సంఘటన స్థలిలోనే ఐదుగురు మృతి చెందగా.. మరో 16 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. పేలుడు ధాటికి కార్మికులు సుమారు 100 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు. పేలుడు తీవ్రతకు ఉత్పత్తి విభాగం ఉన్న భవనం కూలిపోగా.. మరో భవనానికి బీటలు వచ్చాయి. సమాచారం అందుకున్న కార్మికుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో అక్కడి పరిస్థితి భీతావహంగా మారింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande