సంక్షేమం దిశగా ప్రభుత్వం పని చేస్తుంది.. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రామారావు
తెలంగాణ, పెద్దపల్లి. 1 జూలై (హి.స.) సంక్షేమం దిశగా ప్రభుత్వం పని చేస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రామారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నరసయ్య పల్లి గ్రామంలో మంగళవారం ఎమ్మెల్యే విజయరమణారావు పర్యటించారు. పెద్దమ్మతల్ల
పెద్దపల్లి ఎమ్మెల్యే


తెలంగాణ, పెద్దపల్లి. 1 జూలై (హి.స.)

సంక్షేమం దిశగా ప్రభుత్వం పని చేస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రామారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నరసయ్య పల్లి గ్రామంలో మంగళవారం ఎమ్మెల్యే విజయరమణారావు పర్యటించారు. పెద్దమ్మతల్లి ఆలయ ప్రహరీ గోడ నిర్మాణానికి, సిసి రోడ్లులకు భూమి పూజ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు మంజూరు పత్రాలు అందజేసి, ముగ్గురు పోశారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాల ఆవరణలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళా సంఘం భవనానికి రూ. 10 లక్షల వరకు, పెద్దమ్మతల్లి ఆలయ ఆవరణలోని ప్రహరీ గోడ నిర్మాణానికి రూ.5 లక్షలను మంజూరు చేస్తామన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande