హైదరాబాద్, 1 జూలై (హి.స.)
ఫ్లైఓవర్ పై ఓ గుర్తు తెలియని పాదచారుడిని కారు ఢీ కొట్టిన ఘటనలో వ్యక్తి మృతి చెందారు. ప్రమాద ఘటనను పంచనామా చేస్తున్న ప్రొబేషనరీ ఎస్ఐ వెంకటేశంను డీసీఎం ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో ఎస్ఐ రెండు కాళ్లు విరిగిపోయాయి. అతడిని చికిత్స నిమిత్తం నగరంలోని యశోద దవాఖానకు తరలించారు. వివరాల ప్రకారం మంగళవారం తెల్లవారుజామున 3.10 గంటలకు గుర్తు తెలియని వ్యక్తి బాలానగర్ ఫ్లైఓవర్ నుంచి కూకట్పల్లి వైపు నడుచుకుంటూ వెళ్తుండగా కారు ఢీకొట్టిన సంఘటనలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనను పంచనామా చేసేందుకు ప్రొబేషనరీ ఎస్ఐ వెంకటేశం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విధి నిర్వహణలో ఉన్న ప్రొబేషనరీ ఎస్ఐ వెంకటేశంను బోయిన్పల్లి వైపు నుంచి వేగంగా దూసుకువచ్చిన డీసీఎం ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడి రెండు కాళ్లు విరిగిపోయాయి. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం నగరంలోని మాదాపూర్ యశోద ఆసుపత్రికి తరలించారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్