అమరావతి, 1 జూలై (హి.స.)
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్‌లో ర్యాగింగ్ కలకలం రేగింది. తిరుపతికి చెందిన ఓ విద్యార్థిని 15 మంది సీనియర్లు ర్యాగింగ్ చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడి ఫిర్యాదుతో ఆ 15 మందిని సస్పెండ్ చేసినట్లు అధికారులు ప్రకటించారు.
జూన్ 22న వసతిగృహంలోని స్నేహితుడితో మాట్లాడుతుండగా గదిలో ఉన్న మిగిలిన విద్యార్థులు తన మనసును గాయపరిచేలా వ్యవహరించారని బాధిత విద్యార్థి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ ఫిర్యాదును పరిశీలించి జూన్ 23న 15 మంది విద్యార్థులను సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ