తెలంగాణ, నిజామాబాద్. 1 జూలై (హి.స.)
ఎస్సారెస్పీ ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలోని
మహారాష్ట్రలో గోదావరి నదిపై నిర్మించిన వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు గేట్లను అధికారులు ఎత్తివేశారు. మొత్తం 14 గేట్లు ఉండగా అన్నింటిని పైకి ఎత్తి బ్యారేజీలో నిల్వ ఉన్న నీళ్లను దిగువ గోదావరిలోకి వదిలిపెట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం ఏటా జూలై 1 నుంచి అక్టోబర్ 28 వరకు నదీ ప్రవాహానికి ఆటంకం లేకుండా ప్రాజెక్టు గేట్లను తెరచి ఉంచాలని సుప్రీంకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం కేంద్ర జల సంఘం అధికారులు గేట్లను ఎత్తి దిగువకు వరద నీటిని వదిలిపెట్టారు. ఈ ప్రక్రియ మహారాష్ట్ర, తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారుల సమక్షంలో జరుగుతుంది. బాబ్లీ బ్యారేజీ గేట్లు ఎత్తడం వల్ల ఒక టీఎంసీ వరద నీరు వచ్చే అవకాశం ఉన్నట్లుగా ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు