తెలంగాణ, సూర్యాపేట. 1 జూలై (హి.స.) సూర్యాపేట జిల్లాలోని
మిర్యాలగూడలో చిట్టీల పేరుతో
మోసాలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను టూ టౌన్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. మిర్యాలగూడ పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. పట్టణంలోని శాంతినగర్కు చెందిన సైదిరెడ్డి, కటికం వెంకటరెడ్డి, ముత్తిరెడ్డికుంటకు చెందిన మామిళ్ళ వెంకన్న, రాంనగర్కు చెందిన గుణగంటి జానయ్యలు గత కొంతకాలంగా చిట్టీల పేరుతో పలువురు నుండి డబ్బు వసూలు చేస్తూ మోసం చేశారు.
ఇంట్రెస్ట్ ఎక్కువగా ఇస్తామని ఆశ చూపి, 42 మంది బాధితుల నుండి సుమారు రూ.1.50 కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని బాధితులు అడగగానే తాము పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పినప్పుడు, నిందితులు బెదిరింపులకు కూడా పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుల వద్ద నుంచి 46 చిట్టి పుస్తకాలు, 50 ప్రాంసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు