సిగాచి ప్రమాదంలో నవ దంపతుల మిస్సింగ్.. ఆచూకీ కోసం కుటుంబ సభ్యుల ఆరా
హైదరాబాద్, 1 జూలై (హి.స.) సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో నవ దంపతులు మిస్సింగ్ అయ్యారు. కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన నిఖిల్ రెడ్డి, నామాల శ్రీ రమ్య పరిశ్రమలో పని చేస్తున్నారు. ఒకరినోకరు ఇష్టపడ్డ ఇరువురు కొన్ని రోజుల కింద ప్రేమ వివాహం చేసుకున్నా
సిగాచి ప్రమాదం


హైదరాబాద్, 1 జూలై (హి.స.)

సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో నవ దంపతులు మిస్సింగ్ అయ్యారు. కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన నిఖిల్ రెడ్డి, నామాల శ్రీ రమ్య పరిశ్రమలో పని చేస్తున్నారు. ఒకరినోకరు ఇష్టపడ్డ ఇరువురు కొన్ని రోజుల కింద ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ తిరువూరు ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాస్ రావు ఇరువురు కుటుంబ పెద్దలను ఒప్పించి ఆషాఢ మాసం తర్వాత పెద్దల సమక్షంలో పెళ్లి జరపాలని నిర్ణయించారు. ఆలోపు ప్రమాదంలో ఇరువురు గల్లంతయ్యారు. వీరి ఆచూకీ కోసం తిరువూరు ఎమ్మెల్యే ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande