నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలే : ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్
తెలంగాణ, పెద్దపల్లి. 1 జూలై (హి.స.) నిబంధనలు ఉల్లంఘించి ట్రాఫిక్ ఇబ్బందులు కలిగిస్తే జరిమానాలు తప్పవని పెద్దపల్లి ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ తెలియజేశారు. సోమవారం జిల్లా కేంద్రంలో సీఐ అనిల్ తో కలిసి రోడ్లపై వాహనాలు నిలపొద్దని వాహనదారులకు సూచించారు. అ
ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్


తెలంగాణ, పెద్దపల్లి. 1 జూలై (హి.స.)

నిబంధనలు ఉల్లంఘించి ట్రాఫిక్ ఇబ్బందులు కలిగిస్తే జరిమానాలు తప్పవని పెద్దపల్లి ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ తెలియజేశారు. సోమవారం జిల్లా కేంద్రంలో సీఐ అనిల్ తో కలిసి రోడ్లపై వాహనాలు నిలపొద్దని వాహనదారులకు సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ద్విచక్ర వాహనదారులు రోడ్లపై వాహనాలు నిలపొద్దని, చిరు వ్యాపారులు ట్రాఫిక్ కు ఇబ్బందులు కలిగించొద్దని కోరారు.పండ్లు, వస్త్ర, చిరు వ్యాపారాలు రోడ్డుపై వరకు రావడం వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇకపై తరచూ తనిఖీలు నిర్వహిస్తామని, ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగిస్తే జరిమానాల తో పాటు కేసులు నమోదు చేస్తామన్నారు. వాహనదారులు ఎట్టి పరిస్థితుల్లో మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ప్రతినిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande