ఏపీ హోంమంత్రి అనిత‌కు చేదు అనుభవం.. ఏకంగా తన భోజనంలో బొద్దింక
అమరావతి, 1 జూలై (హి.స.)ఏపీ హోంమంత్రి అనిత రాష్ట్రంలోని ఓ బీసీ బాలికల హాస్టల్‌ను సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ క్రమంలో హోంమంత్రి విద్యార్థులతో కలిసి భోజనం చేస్తుండగా ఆమె ప్లేట్‌లోనే బొద్దింక వచ్చింది. దీంతో ఆమె వంటమనుషులపై ఆగ్రహం వ్యక
ఏపీ హోంమంత్రి అనిత‌కు చేదు అనుభవం.. ఏకంగా తన భోజనంలో బొద్దింక


అమరావతి, 1 జూలై (హి.స.)ఏపీ హోంమంత్రి అనిత రాష్ట్రంలోని ఓ బీసీ బాలికల హాస్టల్‌ను సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ క్రమంలో హోంమంత్రి విద్యార్థులతో కలిసి భోజనం చేస్తుండగా ఆమె ప్లేట్‌లోనే బొద్దింక వచ్చింది. దీంతో ఆమె వంటమనుషులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తనకు పెట్టిన భోజనంలోనే బొద్దింక వచ్చిందని వంట సిబ్బందికి చూపించారు. స్కూళ్లలో సన్నబియ్యంతోనే భోజనం పెట్టాలని ప్రభుత్వం ఆదేశించిందని కానీ ఇప్పటి వరకు గ్రౌండ్ లెవల్‌లో అది జరగటం లేదని మండిపడ్డారు. ఒకరిద్దరిని విధుల నుండి తొలగిస్తే దారికి వస్తారని మండిపడ్డారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మంత్రికి పెట్టిన భోజనంలోనే బొద్దింక వస్తే ప్రతిరోజు హాస్టల్‌లో విద్యార్థుల పరిస్థితి ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అలా భోజనం పెడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande