అమరావతి, 10 జూలై (హి.స.)
, : మంత్రి లోకేశ్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన మాధవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఉండవల్లి నివాసంలో బుధవారం జరిగిన ఈ భేటీ సందర్భంగా మాధవ్‌తో కలిసి శాసనమండలిలో పనిచేసిన విషయాన్ని లోకేశ్ గుర్తు చేశారు. ప్రతిపక్షంలో ఉండగా ప్రజాసమస్యలపై శాసనమండలి వేదికగా కలిసి పోరాడిన సందర్భాలు చాలా ఉన్నాయని ఇద్దరు నేతలు గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం కలసి పనిచేద్దామని లోకేశ్ పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ