అమరావతి, 10 జూలై (హి.స.)సమస్య అంటూ తన దగ్గరకు వచ్చినా.. సాయం అంటూ విజ్ఞప్తి చేసినా.. వెంటనే స్పందించేవాళ్లలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఒకరు.. ఇప్పుడు, మానవ అక్రమ రవాణా ముఠాల చెరలో మగ్గుతున్న తమ కుమారులను రక్షించాలంటూ ఓ మహిళ విజ్ఞప్తి చేయడంతో వెంటనే స్పందించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఈ వ్యవహారాన్ని వెంటనే కేంద్ర విదేశీ వ్యవహారాల దృష్టికి తీసుకెళ్లారు..
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ