అల్లూరిసితారామ జిల్లా గౌరీదేవి పేట జడ్పీ.హైస్కూలులో మధ్యాహ్న భోజనం.వికటించడం తో 21 మంది అస్వస్థత.
అమరావతి, 11 జూలై (హి.స.) ఎటపాక: అల్లూరి సీతారామరాజు జిల్లా గౌరీదేవిపేట జడ్పీ హైస్కూల్‌లో మధ్యాహ్న భోజనం వికటించడంతో 21 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అన్నం సరిగా ఉడకలేదని వారు ఆరోపించారు. మొత్తం 21 మంది అస్వస్థతకు గురికాగా.. వారిలో ముగ్గురి
అల్లూరిసితారామ జిల్లా గౌరీదేవి పేట జడ్పీ.హైస్కూలులో  మధ్యాహ్న భోజనం.వికటించడం తో 21  మంది అస్వస్థత.


అమరావతి, 11 జూలై (హి.స.)

ఎటపాక: అల్లూరి సీతారామరాజు జిల్లా గౌరీదేవిపేట జడ్పీ హైస్కూల్‌లో మధ్యాహ్న భోజనం వికటించడంతో 21 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అన్నం సరిగా ఉడకలేదని వారు ఆరోపించారు. మొత్తం 21 మంది అస్వస్థతకు గురికాగా.. వారిలో ముగ్గురికి వాంతులయ్యాయి. బాధిత విద్యార్థులను గౌరీదేవిపేట పీహెచ్‌సీకి తరలించి సెలైన్లు పెట్టి చికిత్స అందించారు. మిగిలిన వారికి ప్రథమ చికిత్స అందించామని.. ప్రమాదమేమీ లేదని వైద్యులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande