హైదరాబాద్, 11 జూలై (హి.స.)
హైదరాబాద్లోని గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో శుక్రవారం రాజ్య భాషా విభాగం స్వర్ణ జయంతి సమరోహ్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తాను తెలుగుకు వ్యతిరేకం కాదని అన్నారు. దేశ ప్రజలతో మాట్లాడేందుకు హిందీ నేర్చుకున్నట్లు తెలిపారు. అయితే కొందరు రాజకీయాల కోసం హిందీని వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. ఓటు బ్యాంకు పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. హిందీని వ్యతిరేకిస్తున్న ప్రాంతాల వారికి నా విజ్ఞప్తి.. మనమంతా ఒక్కటే అని కిషన్ రెడ్డి హితువు పలికారు. మన రాజ్య భాష హిందీ అని, మన మాతృభాష తమిళం, కన్నడ, మళయాళం, తెలుగు అని అన్నారు.
దక్షిణ భారత ప్రజలు మాతృ భాషతో పాటు హిందీలో మాట్లాడాలని సూచించారు. రష్యా, చైనా, ఇజ్రాయిల్, జపాన్ వివిధ దేశాల అధ్యక్షులు అధికారిక సందేశాలు, వారి రాజ్య భాష మాట్లాడుతారని చెప్పారు. హిందీ భాషా చాలా సింపుల్ భాష అని, దేశ ప్రజలను కలిపే భాష అని చెప్పుకొచ్చారు. దేశంలో హిందీ భాష మాట్లాడని ప్రాంతాలే కనిపించవని అన్నారు. అన్ని భారతీయ భాషలు ఎంతో సుందరమైనవి అని కొనియాడారు. ప్రతి పుష్పాన్ని వివిధ భాషలుగా అనుకుంటే ఒక పూల దండగా తయారు చేసే దారం హిందీ భాష అని వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్