1916 8 జూలై లో.బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్ట్స్ కళాశాలకు 110 ఏళ్ళు
అమరావతి, 11 జూలై (హి.స.) ఎస్కేయూ, 1916లో జులై 8న అనంతపురంలో బ్రిటిష్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్ట్స్‌ కళాశాలకు 110 ఏళ్ల విశిష్ట చరిత్ర సొంతం. ఎందరో కీర్తి కీరీటాలను సమాజానికి అందించి మరెంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నదీ సరస్వతీ నిలయం. ఇద్దరు రాష్
1916 8 జూలై లో.బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్ట్స్ కళాశాలకు 110  ఏళ్ళు


అమరావతి, 11 జూలై (హి.స.)

ఎస్కేయూ, 1916లో జులై 8న అనంతపురంలో బ్రిటిష్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్ట్స్‌ కళాశాలకు 110 ఏళ్ల విశిష్ట చరిత్ర సొంతం. ఎందరో కీర్తి కీరీటాలను సమాజానికి అందించి మరెంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నదీ సరస్వతీ నిలయం. ఇద్దరు రాష్ట్రపతులతో అనుబంధం ఉన్న కళాశాల ఇది. భారత రాష్ట్రపతిగా పనిచేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ఆ సంవత్సరంలోనే అధ్యాపకుడుగా ఆర్ట్స్‌ కళాశాలలో విధుల్లో చేరారు. మొదట ఆర్ట్స్‌ గ్రూపులు మాత్రమే ఏర్పాటు చేశారు. కళాశాల ఏర్పడినపుడు 41 మంది విద్యార్థులుండేవారు. ప్రస్తుతం సుమారు 4 వేలమంది విద్యార్థులు చదువుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande