అమరావతి, 11 జూలై (హి.స.)
కాకినాడ: రంగరాయ వైద్య కళాశా లో విద్యార్థినులకు లైంగిక వేధింపుల ఘటనలో బాధ్యులను సస్పెండ్ చేశామని కాకినాడ (జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్ తెలిపారు. బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టామన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌తో కలిసి కలెక్టర్ మీడియా సమావేశం నిర్వహించారు.
‘‘ఈనెల 9న కళాశాల ప్రిన్సిపల్ విష్ణువర్ధన్‌కు ఓ విద్యార్థిని నుంచి మెయిల్ వచ్చింది. నలుగురు వేధిస్తున్నారని 50 మంది విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. బయోకెమిస్ట్రీ ల్యాబ్‌లో ఉన్న కల్యాణ్ చక్రవర్తిపై ఎక్కువ ఫిర్యాదులు అందాయి. వాట్సప్‌లో అసభ్య మెసేజ్‌లు, వ్యాఖ్యలు చేస్తున్నట్లు గుర్తించాం. కొంతమంది విద్యార్థులతో మాట్లాడినప్పుడు కల్యాణ్ చక్రవర్తితో పాటు జమ్మిరాజు, గోపాలకృష్ణ, ప్రసాద్ పేర్లు కూడా వచ్చాయి. వారిపైనా చర్యలు తీసుకున్నాం. వారిని సస్పెండ్ చేసిన అనంతరం విచారణ చేపట్టాం. కళాశాలలో గతంలో ఇలాంటివి జరిగాయా? అనే కోణంలో విచారించాం. వేధింపులపై మెయిల్ పంపిన విద్యార్థినిని అభినందిస్తున్నాం’’అని జిల్లా కలెక్టర్ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ