అమరావతి, 10 జూలై (హి.స.)
అమరావతి: ఏపీలో జనగణన చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జనగణన నోటిఫికేషన్‌ను తిరిగి ప్రచురించింది. 2027లో దేశవ్యాప్తంగా జనగణన నిర్వహించాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికోసం ఈ ఏడాది జూన్ 16న కేంద్రహోంశాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. 2027 మార్చి 1 నుంచి దేశవ్యాప్తంగా జగగణన ప్రారంభం కానుంది. రాష్ట్రంలోనూ అదే రోజు ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ ఆదేశాలు జారీ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ