మాజీ సీఎం జగన్ పర్యటనపై పోలీసులు కేసు నమోదు
చిత్తూరు, 10 జూలై (హి.స.)చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం(Bangarupalyam)లో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former Cm Jagan Mohan Reddy) పర్యటన సందర్భంగా ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై పోలీసులు దృష్టి సారించారు. స్థానిక సీసీ టీవీ పు
మాజీ సీఎం జగన్ పర్యటనపై పోలీసులు కేసు నమోదు


చిత్తూరు, 10 జూలై (హి.స.)చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం(Bangarupalyam)లో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former Cm Jagan Mohan Reddy) పర్యటన సందర్భంగా ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై పోలీసులు దృష్టి సారించారు. స్థానిక సీసీ టీవీ పుటేజులను పరిశీలించారు. ఘటనకు కారణమైన వారిని గుర్తించారు. వైసీపీ నేతలు సునీల్‌, కుమార్‌రాజా, రామచంద్రారెడ్డి, గజేంద్ర, కిషోర్‌పై కేసు చేశారు. జగన్‌ పర్యటనలో షరతులు ఉల్లంఘించారని కేసు నమోదు చేశారు. BNS 223, 126(1)r/w 3(5) సెక్షన్లు నమోదు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టనున్నారు. నిందితులకు త్వరలో నోటీసులు జారీ చేయనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande