బీహార్ ఎన్నికల్లో రిగ్గింగ్ జరగనివ్వం.. కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్
ఢిల్లీ 10 జూలై (హి.స.)మహారాష్ట్రలో బీజేపీ నకిలీ ఓట్లను సృష్టించి, ఫలితాలను తారుమారు చేయడానికి వాటిని ఉపయోగించుకుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. రాజ్యాంగాన్ని రక్షించాల్సిన ఎన్నికల సంఘం బీజేపీ ఆదేశాల మేరకు పని చేస్తోందని ఆరోపించారు. 2024లో మహారాష్ట్ర అ
బీహార్ ఎన్నికల్లో రిగ్గింగ్ జరగనివ్వం.. కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్


ఢిల్లీ 10 జూలై (హి.స.)మహారాష్ట్రలో బీజేపీ నకిలీ ఓట్లను సృష్టించి, ఫలితాలను తారుమారు చేయడానికి వాటిని ఉపయోగించుకుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. రాజ్యాంగాన్ని రక్షించాల్సిన ఎన్నికల సంఘం బీజేపీ ఆదేశాల మేరకు పని చేస్తోందని ఆరోపించారు. 2024లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా రిగ్గింగ్‌ జరిగింది.. కానీ, త్వరలో బీహార్‌లో జరిగే ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితాలను పునరావృతం చేయాలని కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ ట్రై చేస్తుందని ఆరోపించారు. ఇందులో భాగంగా ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటరు జాబితా (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) సవరణ ద్వారా ప్రజల నుంచి ఓటు హక్కును లాగేసుకునేందుకు కుట్ర చేస్తుందని రాహుల్ గాంధీ విమర్శించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande